Anganwadis Termination: గడువులోగా విధుల్లో చేరని అంగన్వాడీలకు టెర్మినేషన్ లేఖలు ఇస్తున్న ప్రభుత్వం
ఏపీలో ( Andhra Pradesh ) అంగన్ వాడీలు చేస్తున్న సమ్మె ( Anganwadis Protest ) విరమించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ( AP Govt ) కఠిన చర్యలు తీసుకుంది. ఇటీవల జనవరి 22 ఉదయం 9.30 వరకూ గడువు విధించిన ప్రభుత్వం... ఆలోపు విధుల్లో చేరకపోతే వారిని తొలగిస్తామని తేల్చి చెప్పింది. దీంతో భయపడి కొంత మంది అంగన్ వాడీ వర్కర్లు విధుల్లో చేశారు. కానీ, చాలా మందిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత 42 రోజులుగా సమ్మె చేస్తోన్న అంగన్ వాడీలు, హెల్పర్లపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విధులకు హాజరవని వారందరికీ టెర్మినేషన్ లెటర్లు జారీ చేస్తోంది.