పీఆర్సీ పై పోరు లో ఆందోళన ఉద్ధృతం చేసిన ఉద్యోగులు

విజయవాడలో ని పంచాయ‌తీరాజ్ కార్యాల‌యంలో ప్ర‌భుత్వం జారీ చేసిన పే స్లిప్పుల‌ను పీఆర్సీ సాధ‌న స‌మితి నాయ‌కులు ద‌హ‌నం చేశారు. వివిధ శాఖ‌ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగ సంఘాల నేత విద్యాసాగ‌ర్ మాట్లాడుతూ, స‌మితి ఇచ్చిన ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ద్ద పే స్లిప్పుల ద‌హ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ హించామ‌న్నారు. పే స్లిప్ చూశాక త‌మ అపోహ‌లు పోతాయ‌ని ప్ర‌భుత్వం చెబుతుంద‌ని అయితే అపోహ‌ల‌న్నీ అవ‌త‌లివైపే ఉన్నాయ‌న్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola