వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం దౌర్జన్యం.. స్టూడియోపై దాడి
అనంతపురం వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం దౌర్జన్యానికి దిగింది. శ్రీకంఠం సర్కిల్లో భావనా స్టూడియోపై దాడి చేశారు సంఘం సభ్యులు.
తమ బంద్ పిలుపు పట్టించుకోలేదని అసోసియేషన్ పేరుతో రుబాబు చేశారు. ఫొటో స్టూడియో పెట్టుకొని జీవిస్తున్న రేవతి, నాగరాజుతో వాగ్వాదానికి దిగారు. అసోసియేషన్ ఆఫీస్‌కు కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫొటోలైట్లు తరలించారు. వీడియోగ్రాఫర్‌పై జరిగిన దాడి సంఘటనలో బంద్ కు పిలుపునిచ్చారు. ఆ బంద్ పిలుపునకు విరుద్ధంగా షాపు తెరిచారని దాడి చేశారు. అసోసియేషన్ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.