Pulichintala Project Dam Gates: కొట్టుకుపోయిన పులిచింతల ప్రాజెక్టు గేటు
ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టు గేటు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో భారీగా నీరు వృధా అవుతోంది. వరద నీటి ప్రవాహానికి 16వ నెంబర్ గేటు విరిగిపోయింది. గురువారం తెల్లవారు జామున సుమారు గం.3.20 నిముషాలకు ఈ ఘటన జరిగింది. గేట్లు ఎత్తే క్రమంలో మెకానికల్ తప్పిదంతో గేటు ఊడిపోయిందని అధికారులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఇంజనీరింగ్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ ప్రాజెక్టును పరిశీలించారు.
Tags :
Abp Desam AP News AP Latest News Pulichintala Project Gate Pulichintala Flood Water Pulichintala