Ambati Rambabu argument With Pattabhipuram CI | అంబటి రాంబాబుపై కేసు నమోదు | ABP Desam

Continues below advertisement

మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి పోలీసులపై రెచ్చిపోయారు.గుంటూరు జిల్లాలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో  అంబటి రాంబాబు పాల్గొనాల్సివుంది. ఈ కార్యక్రమానికి తన నివాసం నుండి బైక్ ర్యాలీతో కలెక్టరేట్ కి బయలుదేరారు అంబటి రాంబాబు. ఈ ర్యాలీని పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. ఇంతమందిని పంపించమని.. ప్రతినిధి బృందాన్ని మాత్రమే పంపుతామని చెప్పారు పోలీసులు. దీంతో అంబటి రాంబాబు సహనం కోల్పోయ్యారు. అంబటి పోలీసు అధికారికి మధ్య నడిరోడ్డుపై తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థానిక సీఐకు మధ్యన మాటామాటా పెరిగి.. వాగ్వాదం జరిగింది.  ‘నీ అంతు చూస్తాను’ అంటూ పోలీస్ పై విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘర్షణకు సంబంధించి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసారు. విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుతో సహా వాగ్వాదానికి దిగిన పలువురు వైసీపీ కార్యకర్తలు, నేతలపై కేసు నమోదు చేసారు పోలీసులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola