Amalapuram Vasavi Amma 4crore Decoration | అమలాపురంలో వాసవి అమ్మవారికి 4కోట్లతో డెకరేషన్ | ABP Desam

రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఐదవ రోజు శుక్రవారం వాసవీ అమ్మవారు భక్తులకు శ్రీ మహాలక్ష్మీ దేవిగా  దర్శనమిస్తున్నారు. ఉత్స వాల సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని నూతన కరెన్సీ నోట్లతో అలంకరించడం ఇక్కడ ఆనవాయి తీగా వస్తోంది. ఈ సారికూడా 4కోట్ల 44లక్షల 99 వేల 9 వందల 99 రూపాయల నూతన కరెన్సీ తో ఆలయం ముఖ మండపం, అంతరాలయం, ఘర్భాలయం నందు ప్రత్యేక అలంకారం చేశారు. ప్రత్యేక అలంకరణతో కొలువుదీరిన అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తండోపతండాలుగా వస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పర మేశ్వరి ఆర్య వైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా కమిటీ ప్రతినిధులు మీడి యాతో మాట్లాడుతూ  గతంలో 11 వేల రూపాయలతో మొదలైన ఈ అలంకారం ఇప్పుడు 4  కోట్లకు పైబడి చేరడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భక్తుల సహకారంతో తాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రత్యేక అలంకారం కొరకు కరెన్సీ నోట్లను  అందించిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ఈ సంద ర్బంగా ధన్యవాదాలు తెలిపారు. భారీ నగదు తో అమ్మవారిని అలంకరించిన నేపద్యంలో నలుగురు ఆర్మ్డ్ పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు అమలాపురం డీఎస్పీ టీ ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు.. ఆయన సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.. పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు దర్శించుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola