తాడేపల్లిలో వినాయక నిమజ్జనంలో మద్యం పంపిణీపై స్థానికుల ఆగ్రహం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డ్రమ్ముల్లో మద్యం నింపుకుని వచ్చి, దానికి ట్యాప్ పెట్టి మరీ పంపిణీ చేశారు. మద్యం పంపిణీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా పాల్గొనడం చర్చకు దారి తీసింది.