రెండు వందల ఏళ్ల నుంచి అక్కడ దీపావళి పండగ లేదు.. ఎందుకో మీరూ తెలుసుకోండి
అందరూ దీపాలు వెలిగించుకుని ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటుంటే ఆ పల్లె మాత్రం చీకట్లోనే ఉండిపోతుంది. తారాజువ్వలు, కాకరపువ్వొత్తులతో అన్ని చోట్లా పిల్లలు సందడి చేస్తుంటే అక్కడి చిన్నారులు మాత్రం పండుగకు దూరమై నిద్రపోతుంటారు. ఊరుఊరంతా దీపావళి రోజు దీపాలు వెలిగించరు. ఇదే ప్రకృతి హితం కోసం అందరూ మూకుమ్మడిగా అనుకుని చేస్తోంది కాదు. దాదాపు రెండొందలు ఏళ్లుగా శాపభయంతో వెలుగుల పండుగకు దూరమైన శ్రీకాకుళం జిల్లాలోని ఓ పల్లె కథ.