Visually Challenged Cricket team| నైపుణ్యం ఉన్నా ఆదరణ కరువు | ABP Desam
Continues below advertisement
భారత దేశం లో Cricket అంటే విపరీతమైన క్రేజ్... చిన్నా పెద్దా తేడా లేకుండా క్రికెట్ ను అందరూ ఆస్వాదిస్తారు. మరి ఇదే క్రికెట్ ను చూపు లేని వారు ఆడితే ఎలా ఉంటుంది? ఊహకి అందటం లేదు కదా? కాని వీరి మాదిరే దేశం తరుపున అంధుల క్రికెట్ జట్టు సైతం క్రికెట్ ఆడుతోందని, వారు కూడా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడుతున్నారని ఇప్పటికే నాలుగు ప్రపంచ కప్లు గెలిచారని ఎంత మందికి తెలుసు? వీరి ఆటతీరు చూస్తే అసలు వీరికి కంటి చూపు లేదంటే నమ్మ సఖ్యం కాదు. సాధారణ క్రికెటర్ల మాదిరి గానే వారు ఆడే ఆట చూసిన వారు ఆశ్చర్య పడక తప్పదు.
Continues below advertisement