రోడ్డునపడ్డ అనాథ వృద్ధులకు ఆసరాగా ది నెస్ట్ వృద్ధాశ్రమం
మొక్కగా ఉన్నప్పుడు పెంచి పెద్ద చేస్తే ఎదిగి చెట్టయ్యాక... నీడనివ్వను పొమ్మన్నట్లుగా..సమాజంలో అనేక మంది వృద్ధులు నడిరోడ్డుపై అనాథలుగా మారుతున్నారు. తమ జీవితం బిడ్డల భవిష్యత్ కోసం అంకితం చేస్తే .. చివరి రోజుల్లో కనీసం నాన్న, అమ్మ అని పిలిచేవారే లేక ఒంటరిగా ఇలా వృద్ధాశ్రమాల నీడన బ్రతుకుతున్న వారు కొందరైతే.. ఇప్పటికీ రోడ్ల ప్రక్కన దిక్కులేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు అనేకమంది ఉన్నారు.