Jallianwala Bagh Memorial Complex, Amritsar| పుస్తకాల్లో చెప్పని ఎన్నో నిజాల నిలయం ఇది | ABP

Jallianwala Bagh Memorial Complex, Amritsar |

అది 1919 ఎప్రిల్ 13. పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖీ పండుగ పర్వదినాన కొన్ని వేలాది మంది  భారత ప్రజలు అమృత్సర్ నగరం లోని జలియన్  వాలాబాగ్‌లో సమావేశం అయ్యారు. బ్రిటీష్ పరిపాలకులు ప్రవేశ పెట్టిన క్రూరమైన రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అదే సమయాన బ్రిగేడియర్ జెనరల్ రేగినాల్డ్ డయర్ తన సైన్యం తో ఈ తోట లోకి చొర పడి విచక్షణా రహితంగా ఎటువంటి నోటీస్లు ఇవ్వకుండా సాదారణ భారత పౌరుల మిద తుపాకులతో కాల్పులు జరిపారు. కురిపించారు. 10 నిమిషాలు పాటు 50 మంది సైనికులతో 1,650 రౌండ్లు కాల్పులు జరపగా ఈ దుర్ఘటనలో అధికారికంగా 379 తమ ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయలు పాలయ్యారు. చుట్టూ పెద్ద గోడ, రావడం పోవడం కేవలం చిన్న ద్వారం ద్వారా మాత్రమే సాధ్యం. జెనరల్ రెజినాల్డ్ డయర్  తన సైన్యం తో కలిసి ప్రవేశ ద్వారాలు మూసి వేసి ఈ మారణ హోమానికి పాల్పడ్డాడు. అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ మైఖెల్  ఓ డవయర్  ఈ ఘటనకు ముఖ్య బాధ్యుడు కావడం తో 1940 లో స్వాతంత్ర సమర యోధుడు అయిన ఉద్దం సింగ్ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మైఖల్ ఓ డయర్ ను లండన్ లోని కాక్స్‌టన్‌ హాల్‌ లో తుపాకీ తో గుర పెట్టి తనను కాల్చి 20 ఏళ్ళ తరువాత జలియన్ వాలాబాగ్ నరమేధానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola