ABP News

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP Desam

Continues below advertisement

 తినటానికి తిండి లేదు. స్వాతంత్ర్యం సాధించుకుని పట్టుమని ఇరవై ఏళ్లు కూడా కాలేదు. ఇలాంటి టైమ్ లో మీకు అంతరిక్షం గురించి ఆలోచనలు కావాలా...ఆకాశానికి ఎగిరి ఏం సాధిస్తారు..ఇది నాడు మన దేశంలో స్పేస్ సైంటిస్టులు ఎదుర్కొన్న మాటలు. అప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, రష్యాలు స్పేస్ సైన్స్ లో విజయాల మీద విజయాలు నమోదు చేస్తుంటే భారత్ లో సైంటిస్టులు మాత్రం తమకూ అలాంటి ఓ అవకాశం దొరికితే బాగుండునని ఆశగా ఎదురుచూసేవారు. అయితే ఈ కల అంత త్వరగా సాధ్యపడలేదు కానీ రష్యా చేసిన ఓ అంతరిక్ష ప్రయోగం మన దేశంలోనూ అలాంటి కలలు కనొచ్చు అని శాస్త్రవేత్తలను ఉసికొల్పేలా చేసింది. నాడు సైకిల్ మీద రాకెట్ మోస్తూ, ఎడ్ల బళ్ల పై ఉపగ్రహాలు మోస్తూ మొదలుపెట్టిన ప్రయాణమే...ఈరోజు ఇస్రో ను వందో రాకెట్ ప్రయోగం చేసి దాన్ని విజయంవంతం చేయగల స్థాయికి తీసుకువెళ్లింది.

1957లో రష్యా స్పుత్నిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించినప్పుడు...మన దేశంలోనూ అలాంటి ప్రయోగాలు చేపడితే విజ్ఞానం దిశగా మనవంతు సాయం చేసినవాళ్లమవుతాని అప్పటి ప్రధాని నెహ్రూకు చెప్పి భారత అంతరిక్ష పరిశోధనా ప్రస్థానాన్ని ప్రారంభించింది...విక్రమ్ సారాభాయ్. అందుకే ఆయన్ని గ్రాండ్ ఫాదర్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ అని పిలుస్తారు ఇండియాలో. 1962లో అప్పటికే అటామిక్ ఎనర్జీకి సంబంధించిన కీలకంగా వ్యహరిస్తున్న హోమీ జహంగీర్ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ INCOSPAR ను ఏర్పాటు అయ్యేలా చేయటంలో విక్రమ్ సారాభాయ్ చేసిన కృషి మర్చిపోలేనిది. 

ఈ ఇన్ కో స్పార్ ఇప్పటి ఇస్రోగా మారటానికి ఏడేళ్లు పట్టింది. తొలుత మన స్పేస్ యాక్టివిటీస్ అన్నీ రష్యా సహకారంతోనే జరిగేవి. కానీ ఫ్యూచర్ లో వేరే దేశాలు మన ఉపగ్రహాలకు కావాల్సిన ముడిసరుకులను, పరికరాలను అందించకపోవచ్చని గ్రహించిన విక్రమ్ సారాభాయ్...మనమే మన శాటిలైట్స్ ను తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఇంకోస్పార్ ను ఇస్రోగా మార్చి ఓ స్వతంత్ర సంస్థగా తయారు చేశారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అంతరిక్ష పరిశోధనలు కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ను ఏర్పాటు చేయటంతో ఇస్రో దశ మారిపోయింది.

కానీ మన శాస్త్రవేత్తల ప్రయాణం అంతా సాఫీగా సాగిపోలేదు. 1975లోనే మనం మొదటి ఉప్రగహం ఆర్యభట్టను తయారు చేసినా దాన్ని రష్యా సహకారంతో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ఇప్పుడు కావాల్సిందల్లా మనమే ఓన్ గా రాకెట్ తయారు చేసుకుని ప్రయోగించటమే. 1979లో శ్రీహరి కోట లాంచ్ ప్యాడ్ రెడీ అయిన స్పెస్ లాంఛ్ వెహికల్ SLV ద్వారా మనం చేసిన తొలి ప్రయత్నం ఫ్లాప్. రాకెట్ రెండో దశలో ప్రాబ్లమ్స్ తో అమాంతం కుప్పకూలిపోయింది SLV. కానీ సైన్స్ లో ఫుల్ స్టాప్ లు ఉండవు కేవలం కామా లు మాత్రమే ఉంటాయి. గెలిచామా విజయానికి మరో మెట్టు..ఓడామా విజయం కోసం మరో దారి వెతుక్కోవటమే. ఈ రెండే ఉండే స్పేస్ సైన్స్ లో ఇస్రో సైంటిస్టులు రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడ్డారు. 1980లో రోహిణి 1 ఉపగ్రహంతో మనోళ్లు కమ్ బ్యాక్ చరిత్రలో ఎవ్వరూ మర్చిపోలేనేది. ఏ ఎడ్లబండిలో అయితే ఉపగ్రహాలు మోసుకెళ్లామో...ఏ సైకిల్ పై రాకెట్ డోమ్స్ లాక్కెళ్లామో అక్కడి నుంచి మన దేశం తరపున మన త్రివర్ణపతాకంతో ఓ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. రోహిణి 1 మనం దేశంలోనుంచి ప్రయోగించి అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన తొలి ఉపగ్రహంగా చరిత్రలో నిలిచిపోయింది.  విక్రమ్ సారాభాయ్, సతీష్ ధవన్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావులంతా ఇస్రోకు ఎంతో సర్వీస్ చేశారు.  విక్రమ్ సారాభాయ్, ఎంజీకే మీనన్, సతీష్ ధవన్ తో మొదలుపెట్టి నిన్న మొన్నటి శివన్, సోమనాథ్ ఇప్పుడు నారాయణన్ ను వరకూ 12 మంది ఇస్రో ఛైర్మన్స్ భారత అంతరిక్ష పరిశోధనలను ముందుండి నడిపించారు. 

SLV రాకెట్లు కాస్తా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ PSLV గా మారాయి. 2001లో జియోసింక్రన్జైడ్ స్పేస్ లాంచ్ వెహికల్ జీఎస్ఎల్వీని తయారు చేశాం. ఐదువేలకిలోల బరువున్న రాకెట్లైనా సరే ఈజీగా మోసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని సొంతం మన శాస్త్రవేత్తలు సొంతం చేసుకున్నారు. ఇన్ శాట్స్, ఎడ్యూ శాట్స్, జీ శాట్స్ అంటూ సిరీస్ ఆఫ్ ప్రయోగాలు చేశాం. అనేక ఉపగ్రహాలను విజయంతంగా కక్ష్యల్లో ప్రవేశపెట్టి టెక్నాలజీ పరంగా దేశాన్ని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు నావిగేషన్, మొబైల్ కమ్యూనికేషన్స్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా మన దేశం సగర్వంగా నిలబడటానికి ఇస్రో అందించిన సేవలు మర్చిపోలేనివి. 2005లో సెకండ్ లాంఛ్ ప్యాడ్ ను రెడీ చేసుకున్నాం. 2008లో మనం చేసిన చంద్రయాన్ ప్రయోగంతోనే చంద్రుడిపై నీటి అవశేషాలున్నాయని ధృవీకరించాం. 2014లో హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్ తో సింపుల్ గా అంగాకరక గ్రహాన్ని మొదటి ప్రయత్నంలోనే చేరుకున్నాం. 2016లో ఒకేసారి 20 ఉపగ్రహాలు పంపి రికార్డు సెట్ చేసి...2017లో అంటే నెక్ట్స్ ఏడాదే ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి రాకెట్ లో పంపి అవన్నీ కక్ష్యలో విజయంవంతంగా ప్లేస్ అయ్యేలా చేసి ఇస్రో అంటే ఆర్డినరీ కాదని స్పేస్ సైన్స్ లో బాహుబలి అని పేరు తెచ్చుకున్నాం. ఇక చంద్రయాన్ 2 ఫెయిల్ అయినా కమ్ బ్యాక్ ఇచ్చి చంద్రయాన్ 3తో చంద్రుడిపై  ల్యాండర్ ను దింపి..రోవర్ ను నడిపించి దక్షిణ ధ్రువంపై మన జెండాను పాతాం. ఇక ఇప్పుడు నెక్ట్స్ టార్గెట్స్ చంద్రుడి మీదకు భారతీయుడిని పంపించేలా గగన్ యాన్ ప్రాజెక్టు... సొంతంగా మనకంటూ ఓ స్పేస్ స్టేషన్ ను నిర్మించుకునేలా ఏర్పాట్లు.... శుక్రుడిపై చేయబోయే శుక్రయాన్ యాత్ర. ఇవన్నీ ఎవ్వరూ ఊహించని స్థాయిలో మన ఇస్రో సాధించిన ప్రగతి. ఈరోజు అమెరికా, రష్యా, జపాన్, యూరోపియన్ ఏజెన్సీ స్ తర్వాత అంతటి స్ట్రాంగ్ స్పేస్ ఏజెన్సీ ఉందీ అంటే దటూ కమర్షియల్ బిజినెస్ చేయగల స్పేస్ కామర్స్ ఆర్గనైజేషన్ ఉందీ అంటే అది కేవలం ఇస్రోనే అనేంత స్థాయికి ఎదిగాం. ప్రయత్నం చిన్నగానే మొదలై ఉండొచ్చు. కానీ రీసౌండ్ చాలా పెద్దగా వినిపిస్తూ ఈ రోజు చేసిన GSLV F15 ప్రయోగంతో సగర్వంగా వందో రాకెట్ ను లాంఛ్ చేసి...ఇస్రో ఘనతను సగర్వంగా చాటాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram