Anantapur Police Mass Warnings: మీసం తిప్పుతూ వార్నింగ్ ఇస్తున్న అనంతపురం జిల్లా సీఐలు | ABP Desam
రాజకీయాలకు పెట్టింది పేరు... అనంతపురం జిల్లా. నిత్యం అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటలు నూరుతుంటాయి. కొన్నిసార్లు పరిస్థితి అదుపుతప్పి దాడులు కూడా జరుగుతుంటాయి. వీటిని ఆపాలంటే పోలీసుల పని కత్తిమీద సాము లాంటిది. అయితే ఇటీవల పోలీసులు ట్రెండ్ మార్చారు. ప్రతిపక్ష నేతలు నిరసన అంటే మరో ఆలోచన లేకుండా వార్నింగ్స్ ఇచ్చేస్తున్నారు.