ABP Desam 3rd Anniversary | ప్రజల మద్దతుతో మూడు వసంతాలు పూర్తి చేసుకున్న ABP Desam

ABP Desam 3rd Anniversary | ఏబీపీ దేశం మరో ముందడుగు వేస్తోంది. మూడేళ్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసి నూతన ఉత్తేజంతో నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. జూలై 30 2021న తెలుగునేలపై తొలి అడుగు పెట్టాం. అప్పటికి ఏబీపీ తెలుగు భాషలో వీక్షకులకు మేం కొత్త. కానీ ఈ బ్రాండ్ దేశ ప్రజలకు వందేళ్లకు పైగా తెలుసు. బెంగాల్ నేలపై పుట్టిన ఆనంద్ బజార్ పత్రిక- ABP గ్రూప్ ఈ నెలలోనే 102 ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాంటి గ్రూపు నుంచి ఏబీపీ దేశం పేరుతో తెలుగుమార్కెట్లోకి అడుగుపెట్టాం. ఏబీపీ గ్రూపులో భాగమైన ఏబీపీ నెట్‌వర్క్ పరిధిలో జాతీయ వార్తా చానెల్ ఏబీపీ న్యూస్‌తో పాటు, రీజనల్ శాటిలైట్ చానళ్లు మరాఠీలో మాఝా, బెంగాళీలో ఆనందో, గుజరాతీలో అస్మిత ఉన్నాయి. వీటితో పాటు డిజిటల్ ఛానళ్లుగా పంజాబీలో సాంజా, తమిళనాడులో ఏబీపీనాడు, హిందీ డిజిటల్ ఛానల్ గంగ ఉన్నాయి. తెలుగులో ఏబీపీదేశం పేరుతో వచ్చాం. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారే కాదు... దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు రీడర్లు... సరిహద్దులకు ఆవల ఉన్న ప్రవాసాంధ్రులకు అభిమానపాత్రంగా మారింది మీ ఏబీపీ దేశం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola