Is mpox the next COVID | Mpox మరో కొవిడ్ కానుందా..? లాక్‌డౌన్ తప్పదా..? | ABP Desam
Is mpox the next COVID |ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న మరో వ్యాధి...Mpox..! ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో ఇది కూడా కొవిడ్ లాగా మారుతుందా..? మళ్లీ లాక్ డౌన్ పెడతారా..? అన్న భయాలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. కొవిడ్ అనేది అంటు రోగం. అందుకే మహమ్మారిలా మారింది. మరి MPox కూడా అంటు రోగమా అంటే యస్ అంటురోగమే కానీ, మరి కొవిడ్ అంతలా ఐతే కాదు. ఎలాగంటే.. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. కరోనా పేషెంట్ ఉన్న రూంలో దూరంగా ఒక మూలన ఉన్నా....గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. MpoX అలా కాదు. గాలి ద్వారా వ్యాప్తి చెందదు. మరి స్కీన్ టు స్కీన్ టచ్ ఐతేనే వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. mpoX వైరస్ సోకినా వ్యక్తి పక్కన బెడ్ పడుకుంటే స్కీన్ టచ్ కాకున్నా సోకే ప్రమాదముంది. అంతేకానీ, ఒకే బస్సులో ఉన్నా.. ఒకే స్టోర్ లో షాపింగ్ చేస్తున్నా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు.