Sub-Classification of SC/ST | APలో ఎస్సీ వర్గీకరణ కొత్త చిక్కులు తెచ్చేనా..? | ABP Desam

Sub-Classification of SC/ST  |

ఎస్పీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కోటా అమలు వైపే తెలంగాణ మొగ్గుచూపుతోంది. ఎస్సీ సబ్ కోటా వెంటనే అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరి ఏపీలో ఏం చేస్తారన్నది ఆసక్తిగా ఉంది. 

 

ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పును వెలువరించింది. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో ఉప కులాలకు సబ్ కోటా కేటాయించుకునేందుకు రాష్ట్రాలకు అధికారం కల్పించింది. ఒకప్పుడు ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ తీర్పును అమలు చేసే విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ వెంటనే ఈ తీర్పును అమలు చేసి వర్గీకరణ చేయాలని ఆ ప్రభుత్వం దూకుడుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola