Solar Missions in the World : Aditya L1 తో మరో రికార్డు కొడుతున్నాం | ABP Desam
Continues below advertisement
ఇస్రో ఆదిత్య L1 ప్రయోగం చేస్తున్న ఈ టైమ్ లో ప్రపంచం మరో సారి భారత్ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ తర్వాత భారత్ చేపడుతున్న ప్రయోగం కావటం ఓ కారణమైతే...కేవలం 400 కోట్ల రూపాయల ఖర్చుతో ఆదిత్య L1ను 15లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ 1 కు ఇస్రో పంపిస్తుండటం మరో ఆసక్తికర అంశం . నాలుగు నెలలు పాటు స్పేస్ లో ప్రయాణించి L1 ను చేరుకోనున్న ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడిపై నిరంతం పరిశోధనలు చేస్తూ ఇస్రోకు విలువైన సమాచారం అందించనుంది. అసలు ఏయే దేశాలు ఇప్పటి వరకూ సూర్యుడి మీద ప్రయోగాలు చేశాయి. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మిషన్స్ ఏంటో తెలుసుకుందాం.
Continues below advertisement