Shyam singha roy oscar : మొన్న RRR, నిన్న శ్యామ్ సింగరాయ్ ఆస్కార్ బరిలో ఉన్నాయా..? | ABP Desam

ఇప్పుడు నాని, సాయిపల్లవి జంటగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' మూడు విభాగాల్లో ఆస్కార్స్ కి అఫిషియల్ సబ్మిషన్ గా వెళ్లిందనే వార్త ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్, పీరియాడిక్ ఫిల్మ్ కేటగిరిల్లో ఆస్కార్ నామినేషన్లకు శ్యామ్ సింగరాయ్ పోటీపడుతోందని ప్రముఖ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ తెలిపింది. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ కి ఉన్న క్రెడిబులిటీ దృష్య్టా భారత్ లో అన్ని ప్రముఖ పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఇదే వార్తను ప్రసారం చేశాయి. కానీ నిజంగా ఈ సినిమా అఫీషియల్ ఎంట్రీగా వెళ్లిందా అంటే ఏమో ఎవరికీ క్లారిటీ లేదు. ఆఖరికి ఆ చిత్ర బృందం కూడా ఎక్కడా ఈ వార్తపై స్పందించలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola