Sahiti Sarvani Elite Fraud : ఫ్లాట్స్ మీ సొంతమంటూ సాహితీ రియల్ చీటింగ్ బాధితుల లబోదిబో! | ABP Desam
హైదరాబాద్ లో భారీ రియల్ దోపిడీ వెలుగుచూసింది. రియల్ ఎస్టేట్ పేరుతో సాహితీ ఇన్ఫాటెక్ బాధితుల వద్ద వందల కోట్లు వసూలు చేసి తీరా ఇళ్లు నిర్మాణం ఎప్పుడంటే చేతులెత్తేసింది. అమీన్ పూర్ లో డబుల్ ,ట్రిపుల్ బెడ్ రూమ్ ఇల్లు తక్కువ ధరకు అంటే నమ్మి ఒక్కొక్కరు 25 నుండి 45 లక్షలు ఇలా వందల కోట్లు చెల్లించారు. తీరా మోసపోయామని తెలుసుకుని సిసిఎస్ లో ఫిర్యాదు చేసేందుకు సిద్దమైయ్యారు.