RG Kar Medical College | Kolkata Doctor Case Explained | అమ్మాయిలకు ఇంకా రక్షణ లేదా..? | ABP Desam

RG Kar Medical College | Kolkata Doctor Case Explained | అర్ధరాత్రి 12 గంటలకు నడి రోడ్డుపై ఓ అమ్మాయి స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అన్నారు గాంధీజీ. మరి.. ఈ రోజు మనం జరుపుకుంటున్నది నిజమైన స్వాతంత్ర్య వేడుకలేనా..? అంటే డౌటే. కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసు నేపథ్యంలో ఇది బలంగా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ట్రైనీ డాక్టర్ హత్య కేసులో ఏం జరిగింది..? అసలు కేస్ అప్ డేట్ ఏంటీ..? అన్నది ఇప్పుడు క్లియర్ కట్ గా ఇప్పుడు మాట్లాడుకుందాం..!

 

కోల్ కతాలో RG KAR అనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఉంది. అక్కడ... 31 ఏళ్ల  ఓ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంకడ్ ఇయర్ చదువుతోంది. ట్రైనీ డాక్టర్ గా అదే హాస్పిటల్ లో పని చేస్తుంది. అది ఆగస్టు 8 అర్ధరాత్రి 2 గంటల సమయం....  అప్పటికే తను కంటిన్యూస్ గా 36 గంటల పాటు షిఫ్ట్ లో ఉంది. సో.. వర్క్ లోడ్ నుంచి కొంచెం రిలాక్స్ అవుదామని అనుకుంది. ఐతే.. రెస్ట్ తీసుకుందామా అంటే ట్రైనీ డాక్టర్స్ కు ప్రాపర్ రూమ్స్ లేవు అక్కడ. దీంతో.. సెమినార్ హాల్ లో ఐతే ఎవరు ఉండరు కదా ఈ టైంలో అని అక్కడికి వెళ్లి నిద్రపోయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola