Pawan Kalyan Janasena Political Strategy: ఎదురుగాలిలో జనసేనాని ప్రయాణం.. ఏమవుతుందో..? | ABP Desam
Continues below advertisement
జనసేన పెట్టి పదేళ్లైందా.. అలా అనిపించడం లేదే అంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్... ఆదివారం మంగళగిరిలో జరిగిన కాపుల సదస్సులో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ.. దానిని ఆయన వ్యతిరేకులు నెగటివ్ గా మలిచే అవకాశాన్ని ఇచ్చారు. ఈ పదేళ్ల ప్రయాణం చాలా తొందరగా.. కార్యకర్తల మధ్య గడిచిపోయిందని ఆయన భావన కావొచ్చు. కానీ ప్రత్యర్థులకు... విమర్శనాత్మకంగా చూసే వాళ్లకి మాత్రం .. పార్టీ విషయాలను ఎప్పుడూ సీరియస్ గా తీసుకుంటే కదా .. అనే ఎత్తిపొడుపు కూడా కనిపిస్తుంది.
Continues below advertisement