Munawar Faruqui Hyderabad Standup Show : ఏం జరిగినా మాకు సంబంధం లేదని బీజేపీ హెచ్చరికలు | ABP Desam
మునావర్ ఫారూకీ హైదరాబాద్ వస్తే అడ్డుకుంటాం...మునావర్ ఫారుకీ స్టాండప్ కామెడీ పెడితే భౌతిక దాడులకు వెనుకాడం. మునావర్ కు పోలీసులు అనుమతిస్తే ఏం జరుగుతుందో కూడా మేం చెప్పలేం. ఇదీ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలు. పోలీసులు ముందుస్తుగా ఆయన ఇంటికి పోలీసులను పంపించారు. అవసరమైతే అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకాడం అంటున్నారు. ఎందుకు అంటే మునావర్ ఫారుఖీ ని హైదరాబాద్ కు ఇన్వైట్ చేసింది వేరేవరో కాదు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్