Mudragada Padmanabham Letters to Pawan Kalyan: వారంలో రెండోసారి పవన్ కు లేఖరాసిన ముద్రగడ | ABP Desam
ముద్రగడ పద్మనాభం ..ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనాలు సృష్టించిన పేరు. కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేత. అయితే గత కొన్నేళ్లుగా అడపా దడపా మినహా పూర్వ స్థాయిలో క్రియాశీలకంగా ఉండటం లేదు.అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నేపథ్యం లో ఆయన పై వరుస విమర్శల తో విరుచుకు పడుతూ మరోసారి వార్తల్లోకి వచ్చారు ముద్రగడ పద్మనాభం.