Lalu Prasad Yadav Fodder Scam Explained: లాలూ మెడకు ఉచ్చులాంటి దాణా కుంభకోణం కథేంటీ..?ABP Desam
దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష ఖరారైంది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఈ నెల 15నే లాలూను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ కేసులో మరో 24 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు డోరాండ్ ట్రెజరీ కేసుకు సంబంధించిన కుంభకోణానిది. అంటే ఇంతకు ముందు లాలూ ఇదే కుంభకోణం కేసుల్లో శిక్షలు అనుభవించారు కానీ అవి వేరు వేరు ట్రెజరీలకు సంబంధించినవి. అసలేంటీ దాణా కుంభకోణం...పశువుల దాణాకు సంబంధించి బిహార్ కు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఇలా అడ్డంగా ఇరుక్కుపోవటం ఏంటీ..