KCR on Early Elections | మళ్లీ పాత వాళ్ళకే టికెట్స్, Target 105 | ABP Desam
తన కుమార్తెనూ పార్టీ మారమని అడిగారని .. ఇంత కంటే ఘోరం ఉంటుందా అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ తీరుపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారిపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు పెరిగే అవకాశం ఉందని .. కేసీఆర్ చెప్పే క్రమంలో కవిత ప్రస్తావన తీసుకు వచ్చారు. తన కుమార్తెను కూడా పార్టీ మారమని అడిగారన్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా దాడులు ఉంటాయని.. ఆందోళన చెందవద్దన్నారు. కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ...మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి...తేల్చుకుందామని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు.