KCR చెబుతున్న కూటమి లేదా ఫెడరల్ ఫ్రంట్ కు అవకాశాలు ఉన్నాయా?
దేశంలో 543 ఎంపీ సీట్లలో దాదాపు 200 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ , బీజేపీ లమద్య స్ట్రేయిట్ ఫైట్ ఉంది. ఇక మిగిలిన ప్రాంతీయ రాజకీయపార్టీలు దాదాపు అన్నీ కాంగ్రెస్ తోనో, బీజేపీతో నే కలిసి ఉన్నాయి. ఇక పెద్ద పార్టీల్లో మిగిలింది టీఆర్ఎస్, వైఎస్ ఆర్ సిపీ, తృణముల్ కాంగ్రెస్, బీజూ జనతాదళ్, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాది ఇవి అన్నీ కలిసి ఒక కూటమి కడతాయా అంటే కష్టమనే చెప్పాలి. టీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి ఉండటంతో సమాజ్ వాదీ, బిఎస్సీ గులాబీ పార్టీతో కలవవు. ఇక తృణముల్ కాంగ్రెస్ తానే ఓ కూటమి తయారు చేయాలని మమతా భావిస్తున్నారు. స్టాలిన్, కుమారస్వామీ, శరద్ పవర్, రాజ్ థాకరే పార్టీలు కాంగ్రెస్ తో కలిసే ఉన్నాయి. వామపక్షాలు కేరళలో లేకపోయినా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ తో కలిసి ఉన్నాయి. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ లేకుండా బీజేపీ సపొర్ట్ లేకుండా సెంట్రల్లో ఏ గర్నమెంట్ ఏర్పాటు కాదు అనేది సత్యం.