Karnataka Reservation Bill Controversy Explained | ప్రైవేటులో రిజర్వేషన్లు... ఎందుకింత వివాదం..? |
Karnataka Reservation Bill Controversy Explained |
ఇది మన రాష్ట్రం.. ఇక్కడ ఉద్యోగాలు అన్ని మన వాళ్లకే. ఈ స్టేట్మెంట్ దేశంలో ఏ సీఎం అన్నా అంతా హీరోలా చూస్తారు. అంతేందుకు.. ఇదే నినాదంతో తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది. కానీ, ఇలాంటి ఓ స్టేట్మెంట్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇస్తే.. ఆయనను ఇప్పుడు విలన్ గా చూస్తున్నారు. ఎందుకంటే... ఆయన చెబుతోంది గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కాదు ప్రవైట్ ఉద్యోగాల గురించి. ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ కన్నడ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని ఓ బిల్లును తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఈ బిల్లులో ఏముంది..? ఎందుకు వివాదాస్పదమవుతుందో ఈ వీడియోల్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం..!
బుధవారం కర్ణాటక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో ఏముందంటే..! ప్రైవేటు కంపెనీల్లో గ్రూప్ సీ, డీ ఉద్యోగాల్లో 100 కు 100శాతం కన్నడ ప్రజలనే తీసుకోవాలి. నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 75 శాతం కర్ణాటక ప్రజలే ఉండాలి. ఇక..మేనేజ్మెంట్ ఉద్యోగాల్లోనూ 50శాతం మంది కచ్చితంగా కర్ణాటక వాళ్లే ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే బిల్లులో ఉన్నది ఇదే..! మరి.. ఇది ఏ కంపెనీలకు వర్తిస్తుంది అంటే... లోకల్ ,నేషనల్ , ఇంటర్నేషనల్, MNC కంపెనీలు అనే తేడా లేదు.. కర్ణాటక భూభాగంలో ఉన్న ప్రతి కంపెనీకి ఇది వర్తిస్తుంది.