cyclone mandous update : కాకినాడ, డా. బీఆర్ అంబేడ్కర్ జిల్లాలో ఈదురుగాలులు | DNN | ABP Desam
మాండుస్ పెను తుపాను ప్రభావం తో కాకినాడ జిల్లా తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీరం పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. కాకినాడ జిల్లా, డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో తుపాను ప్రభావం తో ఈదురు గాలులు వీస్తున్నాయి. రైతులను, మత్స్యకారులను, తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 200 గ్రామాలకు పైబడి తీర ప్రాంత గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతర్వేది, ఓడలరేవు, యానాం, ఉప్పాడ లో సముద్ర తీర ప్రాంతం అలల ఉద్ధృతికి కోతకు గురవుతోంది.