BJP Focus On Telangana: కేంద్రమంత్రుల పర్యటనలు ఓట్ల కోసమా లేక వివాదాల కోసమా..?
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ స్పీడ్ గా పావులు కదుపుతోంది. మరోవైపు పార్లమెంట్ సీట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తెలంగాణను నాలుగు క్లస్టర్స్ గా విభజించి 40 మంది కేంద్రమంత్రుల్ని రాష్ట్రానికి రప్పించనుంది. ఇప్పటికే 16 మంది కేంద్రమంత్రులు రాష్ట్రానికి వచ్చారు. ఈ ఒరవడి అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగనుంది.