Arvind Kejriwal on Currency Notes l కేజ్రీవాల్ కూడా ఎన్నికల కోసం దేవుడిని నమ్ముకున్నారా..? | ABP Desam
Continues below advertisement
రోజురోజుకు రూపాయి విలువ పడిపోతుంది. కరెన్సీ నోట్లపై దేవుళ్ల రూపాలు ఉంచితే.. ఎంతో కొంత వారి అనుగ్రహం పొంది ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఈ మాటలు వింటుంటే... ఎవరో బీజేపీ నాయకులు చెప్పినట్లు ఉంది కదా..! కానీ, ఈ మాటలు చెప్పింది.... దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఓ మాజీ సివిల్స్ అధికారి. భారీ భారీ హామీలు కాకుండా... ఉచిత విద్య,నాణ్యమైన వైద్యం అందించే సీఎం. దేశానికి సరికొత్త దిల్లీ మోడల్ ను పరిచయం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఈ మాటలు చెప్పడమేంటని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇంతకు.. ఈ మాటలు ఆయన ఎందుకన్నారో.. ఓసారి విశ్లేషిద్దాం..
Continues below advertisement