Andhra Pradesh Capital Issue | Amaravathi Visakhapatnam Capital: ఒక్కొక్కరు ఒక్కోలా..! | ABP Desam

ఈ ప్రకటనలు చూస్తుంటే .. ఏపీ ప్రజల కష్టం ఇంకెవరికీ రాకూడదేమో అనిపిస్తోంది. అంటే ప్రతీ రాష్ట్రంలో ఉన్నట్లుగా రోడ్ల ఇబ్బందులు, నీటి కష్టాలు, రైతుల సమస్యలు, అప్పుల భారం ఇలాంటివి మాత్రమే కాదు. వీళ్లకు రాజధాని కూడా ఓ కష్టమే.. మూడేళ్లుగా రాజధాని ఏంటన్న దానిపై ఏ క్లారిటీ లేదు. ఇప్పుడు మూడు రాజధానులు కూడా మూణ్నాళ్ల ముచ్చట అవుతుందా అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రాజధాని విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు...... ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు చేస్తున్న ప్రకటనలు.. వాటికి కౌంటర్లుగా మళ్లీ కొందరు మంత్రులు, ముఖ్యులు, సలహాదార్లు ఇస్తున్న వివరణలు.. ఇవన్నీ చూస్తుంటే.. అలాగే ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola