సంతాన లేమితో బాధపడుతున్న వారికి సంతానం కలిగించడంలో ఫెర్టీ 9 అద్భుతమైన ఫలితాలను సాధించడం పట్ల ప్రముఖ సినీ నటి ఆమని అభినందనలు తెలిపారు. ఫెర్టీ9 పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్‌లోని ఫెర్టీ 9 హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమని పాల్గొన్నారు. ఫెర్టీ 9 అధినేత డా జ్యోతితో కలసి లోగోను ఆవిష్కరించారు.


ఫెర్టీ9 అంటే సంతానం, ఫెర్టీ9 అంటే సంతోషం అనేలా సంస్థ పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు ఆమని. సంతాన లేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ పద్దతిలో సంతానం కలిగిస్తున్నట్టు తెలిపారు. ఇదంతా వ్యాపార దృక్పధంతో కాకుండా సేవా దృక్పధంతో ముందుకు సాగుతున్నారని అభినందించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 50శాతం రాయితీ ఇవ్వడం సంతోషదాయకమని పేర్కొన్నారు ఆమని. మాతృత్వం అనేది మహిళలకు దేవుడిచ్చిన వరం.. ఆ వరం  పొందినప్పుడు తల్లి మొహంలో ఆనందం ఎలా ఉంటుందో ఇక్కడకు వచ్చిన వారందరికీ తెలుసని అన్నారు. అలాంటి ఆనందం చాలా మంది తల్లుల్లో కనిపిస్తోందని వివరించారు. సంతానలేమిపై మహిళల్లో అవగాహన పెరగాలన్నారు ఆమని. 






పదో వార్షికోత్సవం సందర్భంగా అధునాతనమైన అడ్వాన్స్‌డ్‌ ఐవీఎఫ్‌ చికిత్స విధానం ప్రవేశ పెడుతున్నట్టు డాక్టర్‌ జ్యోతి తెలిపారు. ఇది మంచి విజయవంతమైన పద్దతి అని వెల్లడించారు. దీనిపై మహిళలకు రాయితీ కూడా ఇస్తున్నట్టు వివరించారు.