Unique Village: ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు మారుతున్న కొద్దీ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి. అయితే ఈ ఆచారాలు కొన్ని వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి కూడా. కట్టుబాట్లు ప్రతి ప్రాంతంలోనూ ఉన్నా.. కొందరు మాత్రమే వాటిని ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తుంటారు. నగరాలతో పోలిస్తే గ్రామస్థులు ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఓ గ్రామం గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోయేది. ఈ గ్రామంలో ఓ వింత ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారు. ఆ గ్రామం ఎక్కడ ఉంది, వాళ్లు పాటించే ఆ ఆచారం ఏంటి అనేది తెలుసుకుందామా..


ఈ విశిష్ట గ్రామం ఉన్నది భారత్ లోనే


మనం ఇప్పుడు చెప్పుకోబోయే వింత గ్రామం మరెక్కడో, ఆఫ్రికా దేశంలోనో లేదు. ఇక్కడే మన భారత్ లోనే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని మణికర్ణ లోయలో ఉంటుంది పిని అనే గ్రామం. ఇక్కడ శతాబ్దాల నాటి ఆచారాన్ని ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ గ్రామంలో మహిళలు పూర్తిగా దుస్తులు లేకుండానే ఉంటారు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారు. 


ఈ ఆచారం ఇప్పటిది కాదు


మహిళలు దుస్తులు లేకుండా ఉండే ఈ ఆచారాన్ని పిని గ్రామస్థులు ఏడాదంతా పాటించరు. సంవత్సరంలో 5 రోజులు మహిళలు పూర్తిగా దుస్తులు లేకుండా, ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారు. అలాగే ఈ ఐదు రోజుల పాటు ఇతరులు ఎవరూ ఈ గ్రామంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా అడ్డుకుంటారు. శతాబ్దాల నాటి ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు పిని గ్రామస్థులు.


5 రోజులు బట్టలు లేకుండా తిరుగుతారా?


సంవత్సరంలో 5 రోజుల పాటు ఒంటిపై బట్టలు లేకుండా ఉంటారు మహిళలు. అయితే ఈ ఐదు రోజుల పాటు బట్టలు లేకుండానే తిరుగుతారా.. అనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. 5 రోజుల పాటు బట్టలు లేకుండా ఉండే మహిళలు ఇల్లు వదిలి బయటకు రారు. ఇంటి పట్టునే ఉంటారు. ఐదు రోజులు పూర్తయ్యాక మాత్రమే వాళ్లు తిరిగి బట్టలు ధరించి బయటకు వస్తారు. అలాగే ఈ ఆచారం పాటిస్తున్న సమయంలో పురుషులకు కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఈ ఐదు రోజుల పాటు వారు కొన్ని నియమాలను కఠినంగా పాటిస్తారు. మద్యాన్ని ముట్టుకోరు, నాన్ వెజ్ తినరు. అలాగే ఐదు రోజుల పాటు భర్తలు భార్యలతో కూడా మాట్లాడుకోరు. 


ఈ ఆచారం వెనక ఉన్న చరిత్ర ఏంటి?


ఈ ఆచారాన్ని పాటించడం వెనక ఓ కథను చెబుతున్నారు పిని గ్రామస్థులు. శతాబ్దాల క్రితం తమ గ్రామాన్ని దెయ్యాలు ఆక్రమించాయట. గ్రామంలోని వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు ధరింపజేసి రాక్షసులు వారితో పాటు తీసుకు వెళ్లారట. అప్పుడు లహువా ఘోండ్ అనే దేవత ప్రత్యక్షమై ఆ రాక్షసులను ఓడించి మహిళలను విడిపించిందట. అప్పటి నుంచి మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే రాక్షసులు వస్తారని, అందుకే సంవత్సరంలో 5 రోజులు మహిళలు బట్టలు లేకుండా ఉంటారని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు. 
Also Read: మైనస్‌లో కరెంటు బిల్లు, ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్న ఫిన్‌లాండ్‌