ఆమ్లేట్‌లో కూల్‌డ్రింక్ పోసి..వామ్మో ఇదేం టేస్టో..
బయట వర్షం పడుతుంటే హాయిగా ఇంట్లో కూర్చుని దుప్పటి కప్పుకుని నచ్చిన సినిమా చూస్తుంటే...ఆహా ఎంత బాగుంటుందో కదా. మరి వీటికి తోడు మంచి స్నాక్ తోడైతే ఆ ఎంజాయ్‌మెంట్ రెట్టింపవుతుంది. ఇన్‌స్టంట్‌గా స్నాక్స్ చేసుకోవాలంటే మనకు ఉన్న రెండే రెండు ఆప్షన్లు. ఉల్లి పకోడీ లేదంటే ఆమ్లేట్. ఆమ్లేట్ అయితే అందరికీ ఇష్టమే. ఐదే ఐదు నిముషాల్లో హాఫ్ బాయిల్డ్ ఆమ్లేట్ వేసుకుని లాగించేయొచ్చు. అన్నంలోనూ సైడ్‌డిష్‌గా ఇదే పెట్టుకుంటారు. ఆమ్లేట్‌కు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఆ అభిమానులను హర్ట్ చేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూల్‌డ్రింక్ కోకాకోలాతో ఆమ్లేట్ వేసిచ్చాడు ఓ ఫుడ్ స్టాల్ ఓనర్. ఓ ఫుడీ దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. అప్పటి నుంచి "ఆమ్లేట్ విత్ కూల్‌డ్రింక్" ఏంటయ్యా అని పెదవి విరుస్తున్నారు. ఆమ్లేట్ అభిమానులైతే తెగ ఫీల్ అయిపోతున్నారు.
ఈ వీడియోలోని వ్యక్తి మొదట కోకాకోలా తీసుకున్నాడు. మొదట ఎగ్స్ పగలగొట్టి అందులోని సొనను ఓ గ్లాస్‌లో పోశాడు. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి సహా ఇతర ఇన్‌గ్రీడియెంట్స్ యాడ్ చేశాడు. తరవాత కోకాకోలా డ్రింక్ అందులో కలిపాడు. వాటిపై ఓరియో బిస్కట్‌లు పొడి చేసి జల్లాడు. ఎగ్ మిక్స్ పైన పోసి ఆమ్లేట్ తయారు చేశాడు. వాటిపై బ్రెడ్ ముక్కలు కూడా పెట్టాడు. ఈ వీడియో అలా పెట్టాడో లేదో, ఫుడీస్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.