రంగులు మార్చుతున్న హమ్మింగ్ బర్డ్ 


హమ్మింగ్‌ బర్డ్‌ గురించి తెలియని వాళ్లెవరుంటారు చెప్పండి. ముందుకే కాదు వెనక్కైనా ఎగరగలదీ పక్షి. చాలా అరుదుగా కనిపించే ఈ పక్షుల్ని 
వీడియోల్లో చూస్తూ మురిసిపోతుంటారు. హమ్మింగ్‌ బర్డ్‌ని ఎప్పుడు ఏ వీడియో తీసినా ట్రెండ్ అయిపోవాల్సిందే. సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఉందీ పక్షికి. ఇప్పుడు మరోసారి వైరల్ అయింది ఈ బర్డ్. ముందుకు, వెనక్కి ఎగరటంలోనే కాదు. రంగులు మార్చటంలోనూ మంచి టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంది హమ్మింగ్ బర్డ్. ప్రతి కదలికకు ఓ రంగు మార్చుతూ కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 



వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు 


ఓ వ్యక్తి చేతిపై ఉన్న హమ్మింగ్ బర్డ్ డార్క్ గ్రీన్‌ నుంచి బ్లాక్‌ కలర్‌లోకి మళ్లీ బ్రైట్‌ పింక్‌లోకి మారుతూ ఆశ్చర్యపరిచింది. ఇది గమనించిన ఆ వ్యక్తి వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హమ్మింగ్ బర్డ్ తన మెడ తిప్పిన ప్రతిసారీ ఓ రంగు మారుతుండటాన్ని చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ రంగులు మార్చే పక్షిని చూసి కామెంట్ సెక్షన్‌లో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి అద్భుతాన్ని చూడలేదని కొందరు, అద్భుతం అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఎలా రంగులు మారిపోతున్నాయంటూ ఆశ్చర్యపోతున్నారు. మొదట ఇది చూసిన వ్యక్తి తన కళ్లను తానే నమ్మలేకపోయాడట. చాలా సేపు గమనించి వెంటనే లోపలకు పరిగెత్తుకుని కెమెరా పట్టుకొచ్చాడట. వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన ఆ వ్యక్తి మెల్లగా ఆ పక్షిని వేలిమీదకు తీసుకున్నాడు. అది ఎగిరిపోకుండా జాగ్రత్తపడుతూ వీడియో తీశాడు. ఈ ఎక్స్‌పీరియెన్స్‌ని లైఫ్‌లో మర్చిపోలేనని అంటున్నాడా వ్యక్తి.  


రంగులు మారటం వెనక కథ ఇది..


ఇంతకీ హమ్మింగ్‌ బర్డ్ రంగులు మార్చటం వెనక మిస్టరీ ఏంటో శాస్త్రవేత్తలు వివరణ ఇస్తున్నారు. ఈ పక్షుల ఈకలు రకరకాల రంగుల్లో ఉంటాయట. అయితే ఎప్పుడైతే పక్షి కదులుతుందో అప్పుడు ఈ ఈకలు ఓ షేప్‌కి వచ్చేస్తాయి. ఆ షేప్‌లో ఏయే రంగుల ఈకలు దగ్గరవుతాయో అవన్నీ కలిసి ఓ కలర్‌గా ఫామ్ అయిపోతాయ్. అంటే పక్షి కదిలిన ప్రతిసారీ ఇలానే జరుగుతుందన్నమాట. ఉదాహరణకు పింక్‌ కలర్‌లోని ఈకలన్నీ కలిసి ఓ షేప్ ఫామ్ చేశాయనుకుంటే అదే రంగులో పక్షి కనిపిస్తుంది. హమ్మింగ్‌బర్డ్‌కి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఇదని, వీడియో బయటకు రావటం వల్ల అందరికీ ఆ స్పెషాల్టీ ఏంటో తెలిసిందని అంటున్నారు సైంటిస్టులు. సో..రంగులు మారటం వెనక కథ ఇదన్నమాట.