Viral Video: 


చదువు కోసం ఎంత కష్టమైనా పడటానికైనా సిద్ధం...


మన చదువుల కోసం తల్లిదండ్రులే కష్టపడి సంపాదించాలా..? మనంతట మనమే సంపాదించుకుని ఫీజులు కట్టుకోలేమా..? ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ..అలాంటి పరిస్థితులే వస్తే ఎవరైనా సరే కష్టపడక తప్పదు. మనం మాత్రమే ఇలా కష్టపడుతున్నాం అనుకుంటాం కానీ...ప్రపంచాన్ని సరిగ్గా గమనిస్తే ఇలాంటి వాళ్లెందరో ఉంటారు. అలాంటి స్టోరీలు వెలుగులోకి వచ్చినప్పుడు స్ఫూర్తి పొందుతుంటారు చాలా మంది. ప్రస్తుతం ఇలాంటి కథే ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మొహాలీలో ఓ మహిళ తన చదువుల కోసం తానే సొంతగా ఓ చాట్‌ స్టాల్‌ పెట్టుకుంది. ఫుడ్ బ్లాగర్ హ్యారీ ఉపల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. చాట్‌ స్టాల్‌ ముందు నిలబడిన ఆ మహిళ...చాట్, ఆలూ టిక్కీస్, గోల్‌గప్పాస్ అమ్ముతూ కనిపించారు. పై చదువుల కోసం తనంతట తానే కష్టపడి ఇలా సంపాదించుకుంటోంది ఆ మహిళ. అంతకు ముందు వేరే ఉద్యోగం చేసినట్టుగా చెప్పిన ఆమె, చదువుకోటానికి ఇబ్బందిగా ఉందని మానేసినట్టు వివరించారు. ఆ తరవాతే తనకు ఈ స్టాల్ పెట్టుకోవాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. చదువుకోటానికి అవసరమైన డబ్బు సంపాదించుకోటానికి ఎన్ని ఇబ్బందులైనా పడతానని అంటున్నారు. ఈ వీడియోలో బ్లాగర్ హ్యారీ ఆమెను ప్రశ్నలు అడుగుతుండగా, ఆమె సమాధానం చెబుతున్నారు. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి 70 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఆ మహిళ పడుతున్న కష్టాన్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. "నేను చూసిన బెస్ట్ వీడియో ఇదే" అని కామెంట్ చేస్తున్నారు. "మీకు బెస్టాఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్" అని ఇంకొందరు విషెస్ చెబుతున్నారు. 


 






Also Read: Pooja Hegde Latest Photos : న్యూయార్క్‌లో మోడ్రన్ బుట్ట బొమ్మ, పూజా హెగ్డే స్టయిలు బాగుందమ్మా


Also Read: Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు సీఎం గిఫ్ట్