Instagram Viral Videos:


అమ్మకు కాస్ట్ ఎంతో చెప్పకండి..


ఈ హడావుడి లైఫ్‌లో అప్పుడప్పుడూ అలా ఫ్యామిలీతో కాసేపు హాయిగా గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకే కొందరు కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకెళ్లి ట్రీట్ ఇస్తుంటారు. ముఖ్యంగా అమ్మ, నాన్నతో బయటకు వెళ్తే అదెప్పుడూ స్పెషల్‌ గానే ఉంటుంది. వారికి నచ్చిన ప్రదేశాలు చూపించటం, వాళ్లకు ఇష్టమైన ఫుడ్ తినిపించటం భలే కిక్ ఇస్తుంది. ఇలా పేరెంట్స్‌ని బయటకు తీసుకెళ్లిన ప్రతిసారీ నాన్న కాస్త సైలెంట్‌గానే ఉన్నా, అమ్మ మాత్రం తెగ వాయించేస్తుంది. "ఇంత ఖర్చు పెట్టటం ఎందుకురా, నేను ఇంట్లోనే చేసేస్తానుగా" అని సింపుల్‌గా అనేస్తుంది. వాళ్ల మాటలు విని నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేస్తాం. అలాంటి అనుభవమే ఓ కుర్రాడికి ఎదురైంది. అమ్మను బయటకు తీసుకెళ్లి కాస్ట్‌లీ ఐస్‌క్రీమ్ కొనిస్తే, ఆ అమ్మ అన్న మాటలు విని కడుపుబ్బా నవ్వుకున్నాడా కుర్రాడు. ఇదంతా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పెట్టాడు. అంత ఫన్నీ వీడియోను చూశాక నెటిజన్లు ఊరుకుంటారా? అందరికీ షేర్ చేస్తూ వైరల్ చేసేశారు.





 


లక్షలాది వ్యూస్, వందల కొద్దీ కామెంట్స్


రాహుల్ అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు. ముందుగా ఓ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశాడు. తన తల్లికి అందించాడు. ఆ రుచిని ఆస్వాదిస్తున్న తల్లిని చూసి "అమ్మ ఎలా ఉంది" అని అడిగాడు. "చాలా బాగుంది" అని సమాధానమిచ్చింది. "ఇంతకీ కాస్ట్ ఎంత" అని అడిగితే "300 రూపాయలు" అని చెప్పాడా కుర్రాడు. "ఐస్‌క్రీమ్ బాగుంది. కానీ ఇవే డబ్బులు పెడితే నాలుగు రోజులకు సరిపడ కూరగాయలు వచ్చేవి" అని చెప్పింది ఆమె. ఈ సమాధానం విని ఆ కుర్రాడు నవ్వుకున్నాడు. "ఎప్పుడైనా పేరెంట్స్‌కి ఏమైనా కొనిస్తే, దాని కాస్ట్ ఎంతో మాత్రం చెప్పకండి" అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 39 లక్షల మంది చూశారు. 3 లక్షల 40 వేల మందికి పైగా లైక్ చేశారు. వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. ఈ కామెంట్లు కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి. "ఇండియన్ మామ్ ఫరెవర్" అని కొందరు కామెంట్ చేస్తుంటే, "మా అమ్మ కూడా ఇంతే" అని ఇంకొందరు అంటున్నారు.