Viral News: సైకిల్.. ఇప్పుడు చిన్న పిల్లలు మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. కానీ ఒకప్పుడు పెద్ద వాళ్లు కూడా దీన్ని ఎక్కువగా వాడేవాళ్లు. మరీ పాత కాలంలో అయితే పెళ్లిళ్లలో కట్నంగా సైకిల్ ను ఇచ్చేవారు. రానురాను వీటి వాడకం కాస్త తగ్గింది. సైకిళ్లకు బదులుగా స్కూటీలు, బైకులు, కార్లు వచ్చేశాయి. కానీ సైకిల్ ప్రియులు మాత్రం ఆరోగ్యం కోసం ఇప్పటికీ వీటిని వాడుతున్నారు. అయితే వీటి ప్రస్తుతం వీటి ధర 5 నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఉంటోంది. కానీ ఆ సైకిల్ ధర కేవలం 18 రూపాయలే. అలా అని ఏదో పాడైపోయిందో లేక చిన్న ప్లాస్టిక్ బొమ్మో అనుకుంటున్నారేమో.. అలాంటిదేం లేదండి. నిజమైన సైకిల్ ధరే అది. కాకపోతే ఇప్పడిది కాదు. 90 ఏళ్ల క్రితం నాటిది. 90 క్రితం సైకిల్ ధర అక్షరాల 18 రూపాయలు. ఇందుకు సంబంధించిన ఓ బిల్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  



అయితే సంజయ్ ఖరే అనే వ్యక్తి ఈ బిల్లును ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఒకప్పుడు సైకిల్ మా తాతగారి కల అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చారు. ఈ సైకిల్ బిల్లు ప్రస్తుతం నెటిజెన్ల దృష్టిని తెగ ఆకర్షిస్తోంది. దాదాపు 90 ఏళ్ల నాటి బిల్లులో సైకిల్ ధర 18 రూపాయలుగా ఉంది. 1934వ సంవత్సరంలో విక్రయించిన ఈ సైకివ్ ధరను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ బిల్లు ఫొటోలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని మానిక్తలాలో ఉన్న సైకిల్ దుకాణం పేరు కుముద్ సైకిల్ వర్క్స్ గా ఉంది.


ఈ పోస్టు చూసిన చాలా మంది నెటిజెన్లు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నా. ఓ వ్యక్తి తన పాతరోజులను గుర్తు చేసుకుంటూ.. తాను 1977లో ఇంజినీరింగ్ కళాశాలలో చేరినప్పుడు 325 రూపాయలు పెట్టి తాను సైకిల్ కొనుగోలు చేసిన్టలు తెలిపాడు. మరికొందరేమో.. ఇప్పుడు కూడా అదే ధరకు సైకిల్ వస్తే ఎంత బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.