Viral News : తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఎంతగా పరితపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు తమ కోరికలను అన్నింటినీ చంపుకుని తమ బిడ్డల కోసం బతుకుతుంటారు. బిడ్డల కడుపు నింపేందుకు ఎలాంటి పని చేయడానికైన సిద్ధం అవుతారు. అలాంటి బిడ్డలు పెద్ద అయి ఉన్నత స్థాయి చేరుకుంటే వారికి అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అలాంటి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఢిల్లీలో ఒక వ్యక్తి తన తండ్రితో కలిసి 5స్టార్ ఐటీసీ హోటల్‌కు వెళ్లాడు. ఆ తండ్రి దానిని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అది అతను ఐదు సంవత్సరాలుగా వాచ్‌మెన్‌గా పనిచేసింది అదే లగ్జరీ హోటల్ లో. తన తండ్రితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ వ్యక్తి 25 సంవత్సరాల తర్వాత నా తండ్రిని ఐటీసీకి తీసుకెళ్లే అవకాశం వచ్చిందని చెప్పాడు. ఈసారి అతను హోటల్‌కి ఉద్యోగిగా కాదు, అతిథిగా వచ్చాడని పేర్కొన్నాడు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఆర్యన్ మిశ్రా తనను తాను ఖగోళ శాస్త్రవేత్తగా అభివర్ణించుకుంటాడు. అతను ఐటీసీ హోటల్‌లో భోజనం చేస్తున్నప్పుడు తన తల్లిదండ్రుల పక్కన కూర్చున్న ఫోటోను షేర్ చేశాడు. "నాన్న 1995-2000 వరకు న్యూఢిల్లీలోని ఐటీసీలో వాచ్‌మెన్‌గా పనిచేశారు. ఈరోజు ఆయనను అదే చోట విందుకు తీసుకెళ్లే అవకాశం నాకు లభించింది" అని ఆర్యన్ రాసుకొచ్చాడు.
నెటిజన్ల స్పందనఆర్యన్ మిశ్రా రాసిన ఈ చిన్న కథను చదివి సోషల్ మీడియా వినియోగదారులు చాలా సంతోషించారు. ఈ కథనాన్ని షేర్ చేసినందుకు అతనికి ధన్యవాదాలు తెలిపారు. నేటి కాలంలో కూడా తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి ఇలా చేసే కుమారులు ఉన్నారని ఆర్యన్‌ను ప్రశంసిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా రాసాడు.. "మీరు ఎవరనేది నాకు తెలియదు, కానీ మీరు చేసిన ఈ అద్భుతమైన పనిని చూస్తూ నా హృదయం సంతోషంతో నిండిపోయింది" అన్నారు. "మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ క్షణాలను గౌరవించడానికి ఇది ఒక గొప్ప మార్గం. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి" అని మరొక నెటిజన్ అన్నారు. చాలా మంది ఆర్యన్ మిశ్రా భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.