Noida Viral Video: చదువుకున్నా కొంతమందికి సంస్కారం రాదు. అలా సిగ్గుమాలిన పని చేసిన ఇద్దరు టెక్కీలు కటకటాల వెనక్కువెళ్లారు.  ఓ మహిళను వెంటాడి వేధించిన కేసులో ఉత్తరప్రదేశ్ నోయిడా పోలీసులు ఇద్దరు టెక్కీలను అరెస్ట్ చేశారు. నోయిడాలో ఇద్దరు యువకులు ఓ కారులో మరో కారును వెంబడించి మరీ అసభ్యంగా ప్రవర్తించడం.. ఆ వీడియో వైరల్ కావడం కలకలం రేపింది.రోడ్లపై మహిళల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో పోలీసులు వేగంగా స్పందించారు.. వెంటనే వాళ్లని అరెస్ట్ చేశారు. 

Continues below advertisement

వెంటాడి.. వేధించిఆదివారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో బాగా వైరల్ అయింది. RED MG HECTORలో వచ్చిన ఇద్దరు యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఫ్లెయింగ్ కిస్‌లు ఇస్తూ, ఆమె కారును వెంబడించిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటన నోయిడా సెక్టర్-24 పరిధిలో రాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. 

బాధిత మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఎరుపు రంగు SUVలో ఉన్న యువకులు ఆమెను లక్ష్యంగా చేసుకుని అసభ్య సంకేతాలు చేశారు. కారును నడుపుతున్న యువకుడు తన విండో దించి.. ఆమెకు ముద్దులు విసిరాడు... వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నవ్వుతూ ఉన్నారు.  కొంతదూరం వరకూ అదే కారును ఫాలో అవుతూ వేధించారు. వీరి తప్పించుకునేందుకు ప్రయత్నించినా కారును ఫాలో అవుతూ వచ్చాయి. మహిళ కారును నడుపుతున్న వ్యక్తి.. "ఫ్యామిలీ ఉంది ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు" అని అడిగినా వినలేదు.బాధిత కుటుంబం తమను వెంబడిస్తున్న కారును వీడియో తీశారు. ఆ యువకుల ప్రవర్తన గురించి బాధిత మహిళ కూడా వీడియో చేసి పోలీసులను ట్యాగ్ చేశారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Continues below advertisement

వీడియో వైరల్ కావడంతో నోయిడా పోలీసులు వెంటనే స్పందించారు. వాహన నంబర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా SUVను గుర్తించి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు అజాంఘర్ జిల్లాకు చెందిన అమిత్‌కుమార్ కాగా.. మరో వ్యక్తి మణిపురి జిల్లాకు చెందిన అభిషేక్. వీళ్లిద్దరూ ఐటీ ఉద్యోగాలు చేస్తూ నోయిడాలో అద్దెకు ఉంటున్నారు. నిందితులపై అసభ్య ప్రవర్తన, మహిళను వేధించిన కేసుల కింద కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.

ఢిల్లీలో ఏం జరుగుతోంది..? వారం కిందట ఇదే ఘటన

ఢిల్లీలో  వారం రోజుల వ్యవధిలో ఇది రెండో వైరల్ ఘటన. ఐదు రోజుల కిందట ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్లూయెన్సర్ Neetu Bisht ఓ వీడియో చేశారు. ఆమెను ఢిల్లీ నుంచి నోయిడా వరకూ ఓ కారులో వెంటాడారు. ఈ ఘటనలో ఆమె కారును ఢీకొట్టారు కూడా..దాదాపు తన ఇంటి వరకూ వెంబడించారు. ఆమె రోడ్డు పక్కన కారు ఆపి వీడియో తీశారు. రోడ్డుపైన పెద్ద గొడవే జరిగింది. 

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. “డిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఏదో తేడా జరుగుతోంది”, “మహిళలకు రోడ్లపై కూడా భద్రత లేకుండా పోతోంది” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. చదువుకున్నవాళ్లే ఇలాంటి పనులు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.