Lamborghini Car Catches On Fire In Mumbai Road: రూ.కోట్లు విలువైన లాంబోర్గిని కారు (Lamborghini) నడిరోడ్డుపైనే మంటల్లో చిక్కుకున్న షాకింగ్ ఘటన మహారాష్ట్ర ముంబైలో (Mumbai) బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. ఎవరకీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 45 నిమిషాలు శ్రమించి మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్ రిజిస్ట్రేషన్‌తో ఆరెంజ్ కలర్ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలను వ్యాపారం దిగ్గజం గౌతమ్ సింఘానియా (Gautam Singhania) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఈ కారు ఖరీరు రూ.9 కోట్లని తెలుస్తోంది. 

Also Read: Cyber Crime: మార్కెట్లో కొత్త స్కామ్ - మొదట డబ్బు వస్తుంది, వెంటనే ఖాతా ఖాళీ అవుతుంది!