Viral Video : దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ఓ వైపు ఇబ్బందులు పడేవారు ఉంటే వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నవారు లేకపోలేదు. వర్షాకాలం వచ్చేందంటే సీజన్ మారుతున్నట్లే. ఏ సీజన్ తగ్గట్టు ఆ వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కొందరు. అంతే కాదు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు. తాజాగా గుజరాత్ లోని భరూచ్ కి చెందిన ఓ ఆటో వాలా వర్షంలో ఆటో నడుపుకుంటూ వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డుపై మోకాలి లోతులో నీళ్లు ఉన్నాయి. ఆటో నీళ్లలో ఆగిపోయింది. ఆటోను నెట్టేందుకు ప్రయత్నించాడు కానీ బయటికి రాలేదు. ఇదే టైంలో లైట్ రెయిన్ వస్తుంది. మనడో ఏం అనుకున్నాడో ఏమో.. మంచి వాతావరణం అని ఎంజాయ్ చేస్తే పోలా అనుకున్నాడు. తేరీ పాయల్ బాజీ జహాన్ పాటకు డ్యాన్స్ అందుకున్నాడు. ఆటోవాలా వర్షంలో డ్యాన్స్ చేస్తుంటే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లైక్ ల వర్షం కురిసింది. ఇన్‌స్టాగ్రామ్ లో యాక్టీవ్‌గా ఉంటూ.. ఫన్నీ వీడియోలను షేర్ చేసే హాస్య నటుడు సునీల్ గ్రోవర్ ఈ వీడియోను షేర్ చేశాడు.