మన రెగ్యూలర్ లైఫ్‌లో చాలా వస్తువులను ఉపయోగిస్తున్నప్పటికీ కొన్నింటి గురించి మనకు అంతగా ఐడియా ఉండదు. నిత్యం ఉపయోగించే వస్తువుల గురించి మనకు తెలియని ఎన్నో వాస్తవాలు ఉన్నాయి. కానీ, ఈ నిజాలు తెలుసుకున్న తర్వాత అవునా.. నిజమా..? అని షాక్ అవుతుంటాము. కానీ కొన్నింటికి సంబంధించిన అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఆ వస్తువులను చూసే దృక్పథం మారిపోతుంది. ఇలా ప్రతి రోజు మనం వాడే లేదా.. మన చుట్టూ ఉండే వస్తువులకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.
జీన్స్ పాయింట్‌లో కనిపించే చిన్న పాకెట్:
మనం వేసుకునే జీన్స్‌లో ఓ చిన్నపాటి పాకెట్ ఉంటుంది. ఇది నాణేలు ఉంచడానికి ప్యాకెట్ ఇస్తున్నారని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ జేబును జీన్స్ పాయింట్‌కు ఉంచడం అనే ట్రెండ్ చాలా రోజుల నుంచి వస్తోంది. నిజానికి పూర్వకాలంలో చేతి గడియారాలు ఉండేవి కావు. అప్పుడు వాచీలు నడుముకు ధరించి, వాటిని ఉంచడానికి జీన్స్‌లో చిన్న పాకెట్ తయారు చేసేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీలు ఈ పాకెట్స్‌ను ఇస్తున్నాయి. కానీ ఈ విషయం తెలియని చాలా మంది ఈ జీన్స్ పాకెట్స్‌ను వివిధ రకాలుగా వాడుతున్నారు. కొందరు అందులో నాణేలు ఉంచుతుంటే.. మరికొందరు మాత్రం బైక్స్ కీలు లేదా మరేదైనా చిన్న వస్తువులను దాచుకుంటున్నారు.
బబుల్ ర్యాప్ వెనక ఉన్న హిస్టరీ:
గాలితో కూడిన బబుల్ ర్యాప్స్‌ను ఎక్కువగా ఏదైనా వస్తువులను ప్యాకేజింగ్ చేసి, వాటి కింది పైభాగాల్లో వీటిని ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల బాక్స్ ఎలాంటి గాజు వస్తువు లేదా ఎలక్ట్రిక్ వస్తువులు డ్యామేజ్ కాకుండా చూసుకుంటాయి ఈ బబుల్ ర్యాప్‌లు. ఈ బబుల్ ర్యాప్‌ను ఎయిర్ కుషన్ మెషిన్ ద్వారా తయారు చేయబడుతుంది. అయితే వీటిని మనం ఎక్కువగా అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి వస్తువులను కస్టమర్లకు చేర్చే బాక్సుల్లో ఉంటాయి. అయితే ఈ బబుల్‌ర్యాప్‌కు కూడా హిస్టరీ ఉందనే చెప్పాలి. బబుల్ ర్యాప్‌ను ఇద్దరు ఇంజనీర్లు 1957 సంవత్సరంలో వాల్‌పేపర్‌గా తయారు చేశారు.
QWERTY కీబోర్డ్ డిజైన్:
ఈ మధ్య కాలంలో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లను తెగ ఉపయోగిస్తున్నారు. ఈ రెండింటిలో ముఖ్యమైనది కీ బోర్డు అనే చెప్పాలి. ఇది లేనిది కంప్యూటర్‌లో ఏ పని జరగదు. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. పెన్ను పట్టి పేపర్‌పై రాయాల్సిన కాలం పోయింది. ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయాలన్నా ముందుగా కంప్యూటర్ వచ్చి ఉండాలి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో కంప్యూటర్ లేనిదే పనులు జరగవు. అయితే కంప్యూటర్ వాడాలంటే కీ బోర్డు తప్పనిసరి. అయితే కీబోర్డ్ QWERTY డిజైన్ చేయబడిందని మీరు తప్పక చూసి ఉంటారు. ఇలా చేయడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. ఈ డిజైన్ 1872లో అప్పటి టైప్ రైటర్ల కోసం తయారు చేశారంటా. వాస్తవానికి, అప్పట్లో టైపిస్టులు యంత్రం సామర్థ్యం కంటే వేగంగా పని చేసేవారు. దీని కారణంగా టైప్‌రైటర్‌లు కొన్నిసార్లు జామ్ అవుతుండేవి.
వాటి వేగాన్ని తగ్గించడానికి, టైప్‌రైటర్‌లలోని కీబోర్డ్ వేరే విధంగా రూపొందించారు. QWERTYకి సంబంధించిన ఇంకో హిస్టరీ కూడా ప్రచూర్యంలో ఉంది. అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి ప్రస్తుతం మనం వాడుతున్న కీబోర్డును రూపకల్పన చేశారన్న టాక్ కూడా ఉంది. అంతకుముందు A, B, C, D లాగా వరుసగా ఉన్న కీబోర్డుపై క్రిస్టోఫర్ కొన్ని ఇబ్బందులు గమనించారట. ఇంగ్లిష్ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువసార్లు, కొన్నయితే అతి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకు Q, Z W, X, వంటి లెటర్స్ వాడకం తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే వాడుతుంటాము. ఇక అచ్చులు అయిన A,E,I,O,Uలతో పాటు, P, B, L, M, N, K, L వంటివి ఎక్కువ సార్లు ఉపయోగిస్తుంటాము. అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను, ఎక్కువసార్లు వచ్చే అక్షరాలు చేతివేళ్లకు అనుకూలమైన స్థానాల్లోను ఉండేలా షోల్స్ తాను రూపొందించిన టైపు మిషన్ కీబోర్డును QWERTY నమూనాలో రూపొందించారు.