ఓయో.. ఈ పేరు తెలియని వారంటూ ఉండరనే చెప్పాలి. చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా చాలా క్రేజ్‌ వచ్చింది ఈ పేరుతో ఉన్న హోటల్స్‌కి. సుదూర ప్రాంతాలు లేదా కొత్త ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఓయోలో ఉండేందుకు చాలా సులువు అవుతుంది. అంతేకాదు.. గతంలో ఒక్క రోజు హోటల్‌ లాడ్జీలో ఉండేందుకు భారీ మొత్తంలో వసూలు చేసేవాళ్లు హోటల్స్‌ యాజమాన్యాలు. కానీ ఓయో వచ్చిన తర్వత  తక్కువ ధరలతో పాటు భారీ డిస్కౌంట్స్‌లో రూమ్స్‌ దొరకడం సులభం అయింది.


ఓయో కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రితేష్ అగర్వాల్.. ఓయోను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. హాస్పిటాలిటీ రంగంలో సంచలనంగా మారిన ఓయోను 21ఏళ్ల వయస్సులోనే చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడిపిస్తున్నాడు రితేష్‌. అయితే ఇంతటి.. ఆదరణ పొందిన ఓయోకు ప్రైవసీ కొరుకునే యవతీయువకులే ఎక్కువగా వచ్చేవారు. అంతేకాదు.. ఇలా పెళ్లికాని జంటలు ఓయో హోటల్స్‌లో ఉండేందుకు స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా ప్రకటిస్తుంది ఓయో. ఈ క్రమంలోనే ఓ పెళ్లి కాని యువతీయువకుడు ఒకే హోటల్‌ గదిలో ఉండవచ్చా..? అన్న డౌట్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత తరం యువతలో చాలామందికి కలిగే ప్రశ్న ఇది. అసలు మన దేశ చట్టాలు ఏం చెబుతున్నాయి. ఓ జంట హోటల్‌లో ఉండాలంటే.. పాటించాల్సిన రూల్స్‌ ఏమిటో మీకు తెలుసా..


ఏ హోటల్లో అయినా పెళ్లికాని ఓ అబ్బాయి, అమ్మాయి ఒకే గదిలో ఉండవచ్చు. కానీ అందుకు కొన్ని రూల్స్‌ వర్తిస్తాయి. అందులో ముఖ్యంగా హోటల్‌ రూమ్‌లో ఉంటున్న యువతి వయసు 18 ఏళ్లు, యువకుడి వయస్సు 21ఏళ్లు నిండి ఉండాలి. అలాగే వారితో పాటు ఆధార్‌ కార్డ్‌ లేదా ఓటర్‌ కార్డ్‌ లాంటి ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు కలిగి ఉండాలి. ఈ రెండు విషయాలు సరిగ్గా ఉంటే ఏ ఒక్కరు ఆ యువతీయువకుడిని ప్రశ్నించే హక్కు ఏ అధికారికి ఉండదు. అలాగే ఆ రైట్‌ పోలీసులకు కూడా లేదు. ఇండియన్‌ ఆర్టికల్‌ 21 ప్రకారం ఉండవచ్చు. కానీ ఇవి అన్ని సరిగ్గా ఉన్న కొన్నిసార్లు ప్రాబ్లమ్‌ అనే వస్తుంది. అది ఏంటంటే.. పోలీసులు రూమ్‌ సెర్చింగ్‌కు వచ్చిన సమయంలో రూమ్‌లో స్టే చేస్తున్న జంట.. కోపంగా సమాధానాలు ఇస్తుంటారు. లేక తప్పు సమాధానాలు చెబుతుంటారు. దీని వల్ల సమస్య పెరుగుతుంది.


లీగల్‌గానే హోటల్లో ఉంటున్నప్పటికీ.. పోలీసులు వచ్చి మీ ఐడీ ప్రూఫ్‌ను చూపించమని అడిగిన సమయంలో అమ్మాయి, లేదా అబ్బాయి ఎక్కువ సీరియస్‌ అవుతూ, సమాధానం ఇవ్వడం. లేదా ఏ కారణంగా హోటల్లో ఉంటున్నామన్న విషయం చెప్పకుండా తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి చేయడం నేరం కిందికే వస్తుంది. కానీ ఇలా చేయడం కరెక్ట్‌ కాదు. ఇలాంటి సమయంలో పోలీసులు సెక్షన్‌ 42 సీఆర్‌పీసీ యాక్షన్‌, సెక్షన్‌ 151 సీఆర్‌పీసీ కింద యువతీయువకుడిని అరెస్ట్‌ చేసే హక్కు పోలీసులకు ఉంటుంది. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం తప్పకాదన్న విషయం తెలిసి కూడా ఇలాంటి తప్పులు చేస్తుంటారు యువతీయువకులు. మీరు ఉంటున్న రీజన్‌, ఐడీ ఫ్రూలు సరిగ్గా ఉంటే చూపించడంలో ఎలాంటి తప్పలేదు. అలాంటి సమయంలో పోలీసులు సైతం ఏమి చేయడానికి ఉండదు. కానీ అలా కాకుండా పోలీసులు వచ్చారన్న భయంతో లేదా కోపంలో ఇష్టానుసారంగా మాట్లాడితే అదే సెక్షన్స్‌ కింద జైల్లో పెట్టే హక్కు కూడా పోలీసులకు ఉంటుంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కొత్త సెక్షన్లు కూడా జత చేస్తే, మీ సమస్యలు రెట్టింపవుతాయి.