చీర కట్టుకుని బ్యాక్‌ఫ్లిప్‌లు చేయడం చూశాం. సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రపు స్వారీ చేయడం చూశాం. సంప్రదాయ దుస్తుల్లో పవర్‌లిఫ్టింగ్‌కు ప్రయత్నించారు. ఇలా వివిధ రకాలుగా తమ టాలెంట్ నిరూపించుకొని నెటిజన్లు ఆకట్టుకున్నారు. తాజాగా ఓ వధువులు అలాంటి ప్రయత్నమే చేసింది. వైరల్‌గా మారింది. 


కొన్ని రకాల దుస్తులు ధరిస్తే సరిగ్గా నడవమే కష్టం. దానికి తోడు అభరణాలు పెట్టుకుంటే సరేసరి. ఇలాంటి వస్త్రాలంకరణతో చాలా మంది నడవడం, కూర్చవడానికే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా పెళ్లి కూతురు ముస్తాబు మరింత ఎక్కువగా ఉంటుంది.  


వివాహంలో పెళ్లికూతురే  సెంట్రాఫ్ అట్రాక్షన్. అందుకే ఆమెను అందంగా ముస్తాబు చేస్తారు. ఈ క్రమంలో ఆమె కనీసం గట్టిగా గాలి పీల్చుకునేందుకు కూడా వీలు లేకుండా అంలకరిస్తారు. అలా అలంకరించుకున్న ఓ వధువు ఓ అద్భుతం చేసింది. చేసిన ఫీట్‌ ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది.  తల నుంచి కాలి వరకు ఆభరణాలు ధరించి, లెహంగాతో ముస్తాబైన ఆమె తన కండపుష్టిని చూపించే ప్రయత్నం చేసింది. 


హెయిర్‌డ్రెస్సర్‌ల వద్ద పుష్-అప్‌లు చేస్తూ షూట్ చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. వధువు కండరపుష్టిని ప్రదర్శిస్తూ ఐదు పుష్‌అప్‌లు చేసింది. 






ఈ వీడియో ట్విట్టర్‌లో వేల మంది చూశారు. చాలా మంది వైవిధ్యంగా స్పందించారు. ఫిట్‌నెస్ విత్ ఎ డిఫరెన్స్ అంటు ఒకరు కామెంట్‌ చేస్టే లెహంగా, ఆభరణాలతో పుషప్‌లు చేస్తున్న వధువు అంటు మరోకరు పోస్టు చేశారు. 


ఇంకొదరైతే వరుడిని, వాళ్ల తల్లిదండ్రులను ఇంతలా హెచ్చరించాలా? ఓ నాటీ నెటిజన్ పోస్టు పెట్టాడు. "పెళ్లికొడుకును చూస్తే ఆందోళనగా ఉందంటూ మరొకరు ట్వీట్ చేశారు. 


గతంలో ఓసారి వధువు సంప్రదాయ దుస్తులతో జిమ్‌కు వెళ్లి జిమ్మ్ చేయడం వైరల్‌గా మారింది. వధువు భారీ డంబెల్స్ ఎత్తడం ఇతర వ్యాయామాలు చేస్తున్న వీడియోను IPS అధికారి రూపిన్ శర్మ పోస్ట్ చేశారు. జిమ్‌లో చేసిన ఆ ప్రీవెడ్డింగ్ షూట్ అప్పట్లో సంచలనంగా మారింది.