Employee Levae Letter Gone Viral: ప్రభుత్వ రంగమైనా.. ప్రైవేట్ రంగమైనా ఉద్యోగికి సెలవు కావాలంటే పై అధికారిది లేదా యజమాని అనుమతి తప్పనిసరి. ఉద్యోగంలోకి చేరాక సెలవు కావాలన్నా, అత్యవసరమై బయటకు వెళ్లాలన్నా ఎంతో వినయంతో సరైన కారణాన్ని వివరించి పర్మిషన్ అడుగుతారు. సదరు బాస్ కనికరిస్తే ఆ రోజు సెలవు మంజూరవుతుంది. అయితే, ఓ ఉద్యోగి మాత్రం సెలవు కోసం రాసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం రెండే రెండు ముక్కల్లో బాస్‌కు మెయిల్ చేశారు. ఇది నెట్టింట్ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దార్థ్ షా అనే వ్యక్తి ట్విట్టర్ (X) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తన టీమ్ సభ్యుడు సెలవు కోరుతూ తనకు చేసిన మెయిల్‌ను స్కీన్ షాట్ తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'హాయ్ సిద్ధార్థ్, నవంబర్ 8న సెలవు తీసుకుంటా. బాయ్' అని కేవలం రెండే పదాల్లో సదరు ఉద్యోగి లీవ్ లెటర్ ముగించారు. 




దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. సూటిగా, క్లుప్తంగా అనుమతి కోరకుండా విషయాన్ని వివరించిన తీరును చూసి ఆశ్చర్యపోయారు. కొందరు సదరు ఉద్యోగి సెలవు కోసం అనుమతి కోరకుండా డైరెక్ట్‌గా లీవ్ తీసుకుంటున్నట్లు తెలియజేసిన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొందరైతే.. సదరు ఉద్యోగికి క్రమశిక్షణ లేదని.. ఈ తరం యువత ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదని కామెంట్స్ చేశారు.


Also Read: Kamala Harris Networth: ట్రంప్‌ కంటే హారిస్‌ దగ్గరే ఎక్కువ సంపద - అంత డబ్బు ఎలా సంపాదించారు?