వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శలు చేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రాజెక్టులతో ఆయన 20 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు ఇస్తే, కేసీఆర్ పాలనలో ఒక్క ఎకరానికైనా అదనంగా సాగునీరు అందిందా? అని ప్రశ్నించారు.


‘‘కష్టం ఒకరిదైతే.. ప్రచారం మరొకరిది ఈ సామెత  అబద్ధాల కేసీఆర్ కి సరిపోతుంది. పాలమూరు కనీళ్లను చూసి సాగునీళ్ళు ఇచ్చింది YSR అయితే.. తట్టెడు మట్టి మోయని KCR..తానే జలకళ తెచ్చినట్లు గఫ్ఫాలు కొట్టుకుంటున్నడు. అందుకే అంటారు "సొమ్మొకడిది - సోకొకడిది అని" ఎన్నికల వేళ సోకు మాటలు చెప్పే దద్దమ్మ గారు - పాలమూరు ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా? పడావు బడ్డ బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించిన ఘనత ఎవరిదో చర్చకు రాగలరా? YSR జలయజ్ఞం కింద వేసిన పునాదులే.. నేడు కేసీఆర్ చెప్తున్న 20 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు. కల్వకుర్తి ద్వారా 4 లక్షల ఎకరాలు, బీమా కింద 2 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడుతో 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 60 వేల ఎకరాలు, గట్టు, తుమ్మిల్ల, సంగంబండ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రిజర్వాయర్లు. 


YSR హయాంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే.. మీ పదేళ్ల పాలనలో ఒక్క ఏకరాకు అదనంగా సాగునీరు ఇచ్చారా దొర గారు? పాలమూరు - రంగారెడ్డి పేరు చెప్పి 35 వేల కోట్లు మెక్కారే తప్ప ఒక్క ఎకరాను తడిపింది లేదు. 10 లక్షల ఎకరాలు అని చెప్పి 10 ఎకరాలు తడిపింది లేదు. 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి అని చెప్పి 9 ఏళ్లలో 35 శాతం కూడా పనులు కాలేదు. YSR బతికి ఉంటే పాలమూరు ప్రాజెక్ట్  పూర్తయ్యేది. 10 లక్షల ఎకరాలకు ఏనాడో సాగునీరు అందేది.


పడావు బడ్డ పాలమూరు భూములకు సాగునీళ్ళు ఇచ్చిన అపర భగీరథుడు YSR. వెనుక బడ్డ జిల్లాలోనూ ప్రాజెక్టుల పేరు చెప్పి కమీషన్లు దండుకున్న దొంగ KCR. మహానేత హయాంలో  "మైగ్రేషన్ వద్దని ఇరిగేషన్" చేస్తే.. నేడు ఇరిగేషన్ పక్కన పెట్టి మైగ్రేషన్ వైపే మల్లేలా ఉంది దొర కేసీఆర్ పాలన. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ళైనా వలసలు ఆగలేదు. 15 లక్షల మంది పాలమూరు బిడ్డలకు బొంబాయి, దుబాయ్ కష్టాలు తీరలేదు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మీదున్న ప్రేమ దొరకు పాలమూరు మీద లేకపాయే. ఉద్యమ సమయంలో పార్లమెంట్ కి పంపిన గడ్డ అని ఏనాడో మరిచిపోయే’’ అని వైఎస్ షర్మిల ట్వీట్లు చేశారు.