తెలంగాణకు నేడు (ఆగస్టు 25) వర్ష సూచన ఉన్నట్లుగా హైదరాబాద్‌లో వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురుస్తుందని అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఈ జిల్లాల్లోనే వర్షాలు
హైదరాబాద్ వాతావరణ విభాగం వెబ్ సైట్‌లోని వివరాల ప్రకారం.. ఆగస్టు 25న తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు.
Also Read: KTR On Huzurabad: ఆ విషయం తప్ప వేరే పనేం లేదా? హుజూరాబాద్ మాకు లెక్కలోకే రాదు
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో రాగల 5 రోజులకు సంబంధించిన వాతావరణ అంచనాలను అమరావతిలోని వాతావరణ కేంద్రం ట్వీట్ చేసింది. ఆగస్టు 25న కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఒకటి రెండు ప్రాంతాల్లో సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
ఉత్తర, మధ్య, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలన్నింటికీ వర్ష హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, క్రిష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవనున్నట్లు అంచనా వేశారు. రాయలసీమ జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. మరో 5 రోజులకు కూడా ఏపీలో వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Also Read: Revanth Reddy: అప్పుడు పదివేలు కూడా ఇవ్వని కేసీఆర్.. ఇప్పుడు పది లక్షలు ఇస్తా అంటే నమ్ముతున్నారా?