Weather Latest News: ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.  మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. 7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేశారు.


ప్రస్తుత వాతావరణ పరిస్థితి
* అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలపై ఉన్న అల్ప పీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత గుర్తించే అవకాశం ఉంది.


* రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, దామోహ్, పెండ్రా రోడ్, ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడన ప్రాంత కేంద్రం గుండా వెళ్తూ, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.


* తూర్పు - పశ్చిమ గాలుల కోత దాదాపు ఉత్తర భారత ద్వీపకల్పం అయిన 20 డిగ్రీల ఉత్తర అక్షాంశమైన వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణం వైపు వంగి ఉంటుంది.


ఉత్తర కోస్తా, యానాంలో ఇలా..
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడతాయి. రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు పడే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్రలో
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 


రాయలసీమలో
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.






Telangana Weather: తెలంగాణలో ఇలా.. ఇక్కడ రెడ్ అలర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం (జూన్ 12) ఉదయం 6 గంటలకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేడు ఈ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడనుంది. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట్, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి జిల్లా్లలో వచ్చే 3 గంటల్లో భారీ వర్షం కురవనుంది. 




సోమవారం రాత్రి వెల్లడించిన వివరాల మేరకు తెలంగాణలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు ఐఎండీ అధికారులు ఈ జిల్లాల్లో రెడ్ అలర్జ్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణ పేట్ తదితర జిల్లాల్లోనూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.