Weather Latest News: ఆగస్టు 1న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న గంగా పశ్చిమ బెంగాల్ దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఆవర్తనం ఈరోజు దక్షిణ బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న గంగా పశ్చిమ బెంగాల్ మీదుగా సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణం వైపు వంగి ఉంది. ప్రధానంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 5.8 కి. మీ. ఎత్తు మధ్య వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉన్న గాలి విచ్చిన్నతి ఈ రోజు బలహీన పడింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలాచోట్ల, రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అక్కడ అక్కడ బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30 - 40 కిలో మీటర్లు) తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా నమోదైంది. 81 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ‘‘నిన్న షీర్ జోన్ దాదాపు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్ట నుంచి 4.5 నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఈ రజు తక్కువగా గుర్తించారు. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి’’ అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఆగస్టు 1న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.